- Advertisement -
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం గంగానదిలో ఉప నది భాగీరథి నదీ తీరాన కేదార్ఘాట్లో శవాలను వీధి కుక్కలు పీక్కుతిన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో నది నీటి మట్టం పెరిగింది. దీంతో సగం కాలిన మృతదేహాలు, శరీర భాగాలు తీరానికి కొట్టుకొని వచ్చాయి. వీధి కుక్కలు పోట్లాడుకుంటూ వాటిని పీక్కు తిన్నడంతో ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఈ దృశ్యాలు చూసిన తరువాత మానవత్వం చచ్చిపోయిందనిపిస్తోంది. అధికారులు ఇప్పటికైనా అలసత్వం వదిలి ముందుకు కదలకపోతే ఇన్ఫెక్షన్ ప్రబులుతోందని స్థానకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ అధ్యక్షుడు రమేష్ సేమ్వాల్ స్పందించాడు. కొట్టుకొచ్చిన మృతదేహాలను అంత్యక్రియలకు ఓ వ్యక్తిని నియమించానని తెలిపాడు.
- Advertisement -