- Advertisement -
హైదరాబాద్: ఆకాశంలో బుధవారం అద్భుతం చోటుచేసుకుంది. ఇంద్రధనస్సు చుట్టూ రంగుల వలయం ఏర్పడింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఇది కనిపించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాలు చూపరులను కనువిందు చేశాయి. ఈ సుందర దృశ్యాన్ని చూసి అశ్చర్యానికి గురైన ప్రజలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్ లో అప్ లోడ్ చేశారు. సాంకేతికంగా దీనిని ‘మూన్ రింగ్’ లేదా ‘వింటర్ హాలో’ అంటారని నిపుణులు చెబుతున్నారు. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడ్డ కాంతి కిరణాలు వక్రీభవనం చెందడంతో ఈ తరహా వలయాలు ఏర్పడ్డాయని నిపుణులు తెలిపారు.
witness circular rainbow around sun in telangana
- Advertisement -