- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 98,048 మందికి కోవిడ్-19 పరీక్షలు చేయగా 12,768 మందికి వైరస్ సోకింది. తాజాగా 98 మంది కరోనాతో మృతిచెందారు. అదే సమయంలో 15,612 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ప్రస్తుతం 1,43,795 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు.
12768 new covid-19 cases reported in andhra pradesh
- Advertisement -