Saturday, November 16, 2024

అన్‌లాక్‌కు తొందరొద్దు

- Advertisement -
- Advertisement -

Lockdown in India lifted Slowly: ICMR

లాక్‌డౌన్ ఎత్తివేతపై జాగ్రత్తగా వ్యవహరించాలి : ఐసిఎంఆర్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఎత్తివేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, రానున్న మూడో ప్రభంజనాన్ని దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించి, నెమ్మదిగా, క్రమంగా సడలింపులకు ప్రయత్నించాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్) సూచించింది. దీనికోసం మూడు అంశాల ప్రణాళికను ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ వివరించారు. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక శాతం మందికి టీకాలు, కొవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణన లోకి తీసుకొని లాక్‌డౌన్ సడలించడానికి నిర్ణయించాలన్నారు. వారం మొత్తం మీద కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉండడం, ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్న వారిలో అంటే వృద్ధులు, బహుళ రోగాలతో బాధపడి 45 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న వారిలో 70 శాతం కన్నా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరగడం, కొవిడ్‌ను అరికట్టడానికి సామూహికంగా ప్రజలు తగిన విధంగా ప్రవర్తించడం తదితర మూడు అంశాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో అన్‌లాక్ ప్రక్రియ చేపట్టవచ్చని సూచించారు.

పరీక్షలను పెంచి, జిల్లా స్థాయిలో కంటైన్మెంట్‌లను ఏర్పాటు చేయడం, అంత ప్రభావ వంతంగా ఉండదని చెప్పారు. లాక్‌డౌన్‌లను అత్యంత నెమ్మదిగా సడలించాలని అభిప్రాయ పడ్డారు. భార్గవ చెప్పిన సలహాలను ఇప్పటివరకు నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ అధికారిక మార్గదర్శకాల్లో చేర్చలేదు. వ్యాక్సినేషన్‌పై ఆయన మాట్లాడుతూ జులై మధ్య నాటికి లేదా ఆగస్టు మొదటి వారం నాటికి దేశంలో రోజుకు కోటి మందికి టీకాలు అందించే అవకాశం ఉందన్నారు. ‘టీకాలకు కొరత లేదు. ప్రస్తుతం దేశంలో అందరూ టీకాలు వేయించుకోవాలనుకుంటున్నారు. దేశం మొత్తానికి ఒక్క నెలలో టీకాలు వేయలేము కదా. మన జనాభా అమెరికా జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. అందువల్ల కొంత ఓపిక పట్టా’ అని అన్నారు.

Lockdown in India lifted Slowly: ICMR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News