- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఫౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని సంవత్సరాలుగా ఫౌల్ట్రీ యజమానులు, డెయిరీ యూనిట్‌ల ఆస్తిపన్నును రద్దు చేయాలని చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఫౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు చెందిన ప్రతినిధులు ఇదే విషయం సిఎం కెసిఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంతమంది దీనిపై లబ్ధిపొందుతున్నారన్న విషయంపై ఆరా తీసి ఆస్తిపై హక్కు పొందడానికి సంవత్సరానికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సిఎం తీసుకున్న నిర్ణయంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు ఫౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు చెందిన ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -