Monday, November 18, 2024

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
2,835 కిలోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.43.40లక్షల విలువైన 2,835కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా, మాడ్గులమండలం, ఓల్డ్ బ్రాహ్మణపల్లికి చెందిన జాలా వెంకటయ్య వ్యాపారం చేస్తున్నాడు. వినాయక ట్రేడర్స్ పేరుతో షాపు ఏర్పాటు చేసి ఫర్టిలైజర్స్, సీడ్స్ వ్యాపారం చేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన నకిలీ పత్తి విత్తనాలు గడువు పూర్తయినవి, గుర్తింపు లేని విత్తనాలు విక్రయిస్తున్నాడు. అమాయకులైన రైతులు వాటిని కొనుగోలు చేసి తీసుకుని వెళ్లి మోసపోతున్నారు. దాదాపుగా 25వేల ఎకరాలకు విత్తనాలు విక్రయించాడు. ఈ విషయం ఎల్‌బినగర్ ఎస్‌ఓటి పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్, రవికుమార్, వ్యవసాయ అధికారులు కలిసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పత్తివిత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తున్న వ్యక్తిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదర్‌గూడలోని పావని హైబ్రీడ్ సీడ్స్ నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి నకిలీ విత్తనా లు విక్రయిస్తున్నాడు. నకిలీ విత్తనాలకు స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ప ట్టుకున్నారు. వివిధ రకాల బ్రాండ్లకు చెందిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వ్యవసాయ అధికారులకు అప్పగించారు. ఎస్సైలు శ్రీధర్, శ్రీనివాసులు, ఎండి షానవాజ్ షఫీలు పట్టుకున్నారు.

Man arrested for selling fake cotton seeds

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News