ముంబయి: ఏ జట్టులోనైనా భిన్నమైన మనస్తత్వాలు, భిన్నమైన శైలి కలిగిన ఆటగాళ్లు ఉంటారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అని తెలిపారు. పూజారా ఎక్కువ సేపు క్రీజులో ఉంటాడని, పంత్ తక్కువ బంతులు ఆడి ఎక్కువ స్కోర్ చేస్తాడన్నారు. ఏ జట్టులోనైనా 11 మంది పుజారాలు, 11 మంది పంత్‌లు ఉండరని చెప్పారు. ఇంగ్గాండ్ పర్యటనకు ముందు విక్రమ్ మీడియాతో మాట్లాడారు. బ్యాట్స్మెన్లతో విడి విడిగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. పుజారాకు అంకితభావం, ఎక్కువ పట్టుదల, క్రమశిక్షణ ఉంటుందని, పంత్ భయం లేకుండా సరదాగా ఉంటాడని కితాభిచ్చారు. పుజారా కొత్త షాట్లను ఎంచుకోవాలని, క్రీజులో పంత్ ఎక్కువ సేపు ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. విరాట్ కోహ్లీ అత్యంత ప్రతిభ గలిగిన ఆటగాడని, ఐపిఎల్‌లో నాలుగు శతకాలు, భారీ సిక్సర్లు విరుచుకపడిన విరాట్… వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఒక్క బంతిని గాల్లోకి లేపకుండా డబుల్ సెంచరీ చేశాడన్నారు. రోహిత్ శర్మ టెస్టుల్లో రాణించడానికి బ్యాటింగ్ నియంత్రణ అవసరమన్నారు. రహానే గొప్ప ఆటగాడని కొనియాడారు.
అంత మంది పుజారాలు, పంత్‌లు ఉండరు…
- Advertisement -
- Advertisement -
- Advertisement -