Saturday, November 23, 2024

సీరం సంస్థకు స్పుత్నిక్ తయారీ అనుమతి

- Advertisement -
- Advertisement -

DCGI approves Serum's request to manufacture Sputnik

కేంద్రానికి అధర్ పూనేవాలా థ్యాంక్స్

న్యూఢిల్లీ : పుణేకు చెందిన సీరం ఇనిస్టూట్ ఆఫ్ ఇండియాకు టీకాల తయారీలో మరో గొప్ప అవకాశం దక్కింది. రష్యాకు చెందిన స్ఫుత్నిక్ వి టీకాల తయారీకి భారత ఔషధ అధీకృత సంస్థ (డిసిజిఐ) నుంచి అనుమతి లభించింది. ఇప్పటికే సీరం నుంచి కొవిషీల్డ్ టీకాలు తయారు అవుతున్నాయి. దీనికి తోడుగా ఈ అంతర్జాతీయ స్థాయి టీకాను తయారు చేసే అవకాశం సీరం పొందింది. మాస్కోలోని గమేలెయ రిసర్చ్ ఇనిస్టూట్ ఆఫ్ ఎపిడిమిలాజి అండ్ మైక్రోబయాలజీ సంస్థతో సీరం ఈ టీకాల తయారీలో సహకరిస్తుంది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చొరవతో డిసిజిఐ నుంచి స్ఫుత్నిక్ టీకా తయారీకి అనుమతి వచ్చింది. సంబంధిత అనుమతి దక్కేలా చూసినందుకు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు, భారత ప్రభుత్వానికి సీరం ఇనిస్టూట్ అధినేత అధర్ పూనేవాలా కృతజ్ఞతలు తెలిపారు.

తాము స్పుత్నిక్ టీకాలు తయారుచేసేందుకు అనుమతిని ఇవ్వాలని ఒక్కరోజు క్రితమే సీరం సంస్థ డిసిజిఐకి దరఖాస్తు చేసుకుంది. సీరం ఇనిస్టూట్ పరిధిలోని హదాప్సర్ ఉత్పత్తి కేంద్రంలో కొన్ని షరతులతో ఈ టీకా తయారు అవుతుంది. నాలుగు షరతులను విధించినట్లు వెల్లడైంది. రష్య స్ఫుత్నిక్ టీకాలు ఇప్పుడు ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ లాబ్‌లో తయారు అవుతున్నాయి. ఇప్పుడు ఈ అనుమతిని సీరం కూడా పొందింది. ఇక తమ కొవిడ్ వ్యాక్సిన్ ముడిపదార్థాల సరఫరాపై అమెరికా నుంచి ఆంక్షలు వైదొలగడం పట్ల అధర్ పూనేవాలా హర్షం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి సంబంధిత ముడిసరుకు అందేందుకు వీలేర్పడుతుంది. దీనితో టీకాల ఉత్పత్తి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు, ఈ విషయంలో తమకు విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి సరైన సహకారం కీలక దశలో అందిందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News