Saturday, November 23, 2024

సబాలెంకా ఇంటికి…. నాదల్, అజరెంకా ముందంజ

- Advertisement -
- Advertisement -

Azarenka in fourth round for first time

 

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో మరో సంచలన ఫలితం నమోదైంది. మూడో సీడ్ అరినా సబాలెంకా (బెలారస్) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఇప్పటికే టాప్ సీడ్ ఆశ్లే బార్టీ (ఆస్ట్రేలియా) గాయంతో టోర్నీ నుంచి వైదొలగగా, రెండో సీడ్ నవోమి ఒసాకా (జపాన్) వ్యక్తిగత కారణాలతో తనంతట తానే గ్రాండ్‌స్లామ్ నుంచి తప్పుకుంది. తాజాగా మూడో సీడ్ సబాలెంకా కూడా ఓటమి పాలవ్వడంతో టాప్3లోని క్రీడాకారిణిలు అందుబాటులో లేకుండా పోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో చెక్‌కు చెందిన 31వ సీడ్ అనస్టాసియా పవిలుచెంకొవా 64, 26, 63తో సబాలెంకాపై సంచలన విజయం సాధించింది.

ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. తొలి సెట్‌లో అనస్టాసియా ఆధిపత్యం చెలాయించింది. చివరి వరకు దూకుడును ప్రదర్శిస్తూ సెట్‌ను కైవసం చేసుకుంది. కానీ రెండో సెట్‌లో మాత్రం సబాలెంకా పుంజుకుంది. చూడచక్కని షాట్లతో అలరించిన సబాలెంకా అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం ఘోరంగావిఫలమైంది. కనీసం ఒక్క గేమ్‌ను కూడా నెగ్గకుండానే సెట్‌తో పాటు మ్యాచ్‌ను ప్రత్యర్థికి సమర్పించుకుంది. మరోవైపు బెలారస్‌కే చెందిన 15వ సీడ్ విక్టోరియా అజరెంకా నాలుగో రౌండ్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో మాజీ నంబర్‌వన్ అజరెంకా 62, 62తో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్‌ను చిత్తు చేసి ముందంజ వేసింది. మరో పోటీలో కజకిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబాకినా విజయం సాధించింది. రష్యాకు చెందిన ఎలెనా వెస్నినాతో జరిగిన మూడో రౌండ్‌లో రిబాకినా 61, 64తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో రిబాకినా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది.

నాదల్ అలవోకగా..

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్, మూడో సీడ్ రఫెల్ నాదల్ రెండో రౌండ్‌లో విజయం సాధించాడు. ఫ్రాన్స్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్‌తో జరిగిన పోరులో నాదల్ 60, 75, 62తో జయకేతనం ఎగుర వేశాడు. తొలి సెట్‌లో నాదల్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఒక్క గేమ్‌ను కూడా కోల్పోకుండానే సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరి సెట్‌లో సునాయాసంగా నెగ్గ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు.

మరోవైపు ఇటలీకి చెందిన 27వ సీడ్ ఫొబియో ఫొగ్నిని రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. మరోవైపు ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) మూడో రౌండ్‌లో విజయం సాధించాడు. సెర్బియా ఆటగాడు లాస్లొ డెరెతో జరిగిన పోరులో జ్వరేవ్ 62, 75, 62తో జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన జ్వరేవ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా మూడు సెట్లు గెలిచి నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News