Saturday, November 23, 2024

చౌక ధరలో కొవిడ్-19 వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

Biological E's Corbevax may be India’s cheapest COVID-19 vaccine

బయోలాజికల్ ఇకి చెందిన కార్బేవాగ్జ్
ఒక్క డోసుకు రూ.250 మాత్రమే..!!

హైదరాబాద్: కొవిడ్-19 నియంత్రణకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ బయోలాజికల్ ఇ లిమిటెడ్ రూపొందించిన కార్బేవాగ్జ్ ఒక్క డోసు ధర రూ.250గా ఉంటుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల తెలిపారు. రెండు డోసుల ధర రూ.500 అవుతుంది. ఇంకా ధర తగ్గించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ఆమె తెలిపారు. ఇది వాస్తవరూపం దాల్చితే ఓపెన్ మార్కెట్‌లో లభించే వ్యాక్సిన్లలో ఇదే చౌకైనది కాగలదు. కార్బేవాగ్జ్‌కు ప్రస్తుతం మూడో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. రెండు ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలనిచ్చింది. దాంతో,ఈ కంపెనీ నుంచి 30 కోట్ల డోసుల వ్యాక్సిన్ తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్రం ఒక్కో డోసుకు రూ.50 చొప్పున చెల్లించనున్నది. అడ్వాన్స్‌గా రూ.1500 కోట్లు ఈ కంపెనీకి ఇవ్వనున్నది. అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్(బిసిఎం)తో కలిసి రూపొందించిన కార్బేవాగ్జ్ మరికొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్నది.

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లలో సీరమ్ కంపెనీకి చెందిన కొవిషీల్డ్ ఒక్క డోసు ధర రాష్ట్రాలకు రూ.300 చొప్పున, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.600 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించింది. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ ఒక్క డోసు ధర రాష్ట్రాలకు రూ.400 చొప్పున, ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1200 చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. మరోవైపు రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌వి ఒక్క డోసు ధర రూ.995గా డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ తెలిపింది. దీంతో, కార్బేవాగ్జ్ చౌకైన వ్యాక్సిన్‌గా మార్కెట్‌లో అడుగుపెట్టనున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News