- Advertisement -
కెబ్బి: ఆఫ్రికా నైజీరియాలోని వాయువ్య రాష్ట్రమైన కెబ్బి ప్రాంతంలో బందిపోట్లు మారణ హోం సృష్టించారు. రాష్ట్రంలోని డాంకో-వాసాగు స్థానిక ప్రభుత్వ ప్రాంతంలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో బందిపోట్లు కాల్పులు జరిపారని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో 88 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారని రాష్ట్ర పోలీసు ప్రతినిధి నఫియూ అబూబకర్ వెల్లడించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతాల్లో భద్రతాదళాలను మోహరించినట్టు ఆయన తెలిపారు. బందిపోట్ల దాడులను అరికట్టడానికి భద్రతా బలగాలు మోహరించాయి. ఏప్రిల్ చివరలో, కబ్బీలోని తొమ్మిది మంది పోలీసులు, పౌర రక్షణ బృందంలోని ఇద్దరు సభ్యులు ముష్కరుల డాడిలో మృత్యువాతపడ్డారు.
Gunmen kill 88 people in attacks in NW Nigeria
- Advertisement -