న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిజ్జా హోండెలివరీ చేస్తున్నప్పుడు… రేషన్ ఇంటి వద్దకే ఇస్తే తప్పేంటని సిఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. రేషన్ మాఫియాను అడ్డుకోవడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రేషన్ మాఫియాను ఎందుకు ప్రోత్సహిస్తన్నారని కేజ్రవాల్ ఫైర్ అయ్యారు. నిజానికి చట్టప్రకారం ఇది అవసరం లేకపోయిన తాము మాత్రం ఐదు సార్లు కేంద్రం అనుమతి కోరామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. రేషన్ షాపులు కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారే అవకాశం ఉందని సిఎం కేజ్రీవాల్ తెలిపారు. “నేను కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాను, దయచేసి ఢిల్లీ నివాసితులకు రేషన్ ఇవ్వడానికి మాకు అనుమతి ఇవ్వండి” అని ముఖ్యమంత్రి కోరారు. అటు ఢిల్లీలో సిఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ పోరు రోజురోజుకు ముదురుతుంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఢిల్లీ పాలన వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారాయి. సిఎం కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ నో చెబుతున్నారు. తాజాగా ఇంటింటికి రేషన్ పథకానికి బ్రేక్ పడింది. దీనిపై రెండు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
If pizza can be delivered why not ration Says CM Kejriwal