ప్రయాణికుల కోసం బయో టాయిలెట్ల ఏర్పాటు
5064 రైల్ కోచ్‌లలో బయో టాయిలెట్ల ఏర్పాటు
మలవిసర్జన వ్యర్థాల రహితంగా రైల్వే ట్రాకులు
సంవత్సరానికి సుమారుగా రూ.400 కోట్లు ఆదా
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద హరిత రైల్వేగా రూపొందాలన్న భారీ లక్ష్యంతో రైల్వే శాఖ పనిచేస్తోంది. అందులో భాగంగా, అనేక పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ప్రధానంగా ప్రయాణికుల కోచ్‌లన్నింటిలో బయో టాయిలెట్ల్లను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రయత్నంలో భాగంగా రైళ్లలోని ప్రస్తుత సంప్రదాయ మరుగుదొడ్లను బయో టాయిలెట్లు/గ్రీన్ టాయిలెట్లుగా మార్చాలని నిర్ణయించింది. దీంతో రైల్వే ట్రాకులు మలవిసర్జన వ్యర్థాల రహితంగా మారనున్నట్టు అధికారులు తెలిపారు. ట్రాక్‌లపై మల విసర్జన వ్యర్థాలతో అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడటమే కాకుండా ట్రాకులపై పనిచేసే వారికి కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడడానికి, బయో టాయిలెట్లను రైల్వే శాక ప్రవేశపెట్టింది. ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడమే కాకుండా ట్రాకులు తుప్పుపట్టకుండా ఉంటాయని, రైల్వే స్టేషన్లు ఆహ్లాదకరంగా సుందరంగా మారుతాయని రైల్వే శాఖ ఈ దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది.
దక్షిణ మధ్య రైల్వేలో పురోగతి
భారతీయ రైల్వేలో ప్రధానమైన జోన్ అయిన దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలోని ప్రయాణికుల రైళ్లలోని కోచ్‌లన్నింటిలోని మరుగుదొడ్లను పూర్తిగా మార్చివేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా, 5,064 కోచ్‌లలోని మరుగుదొడ్లు బయో టాయిలెట్లగా మారాయి. “స్వచ్ఛ భారత్ మిషన్”లో భాగంగా దీన్ని ఒక లక్ష్యంగా తీసుకొని రికార్డు సమయంలో వేగవంతంగా అధికారులు పూర్తి చేశారు.
కాచిగూడ స్టేషన్‌లో ప్లాట్‌ఫాం 2/3, ప్లాట్‌ఫాం 4/5 వద్ద….
ఈ బయో టాయిలెట్ల ఏర్పాటుతో ట్రాక్‌లు శుభ్రంగా ఉండి వాటిపై విధులు నిర్వహించే సిబ్బందికి ఇబ్బందులు లేకుండా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు అంతేకాక, జోన్ పరిధిలో చేపట్టే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో దక్షిణ మధ్య రైల్వే మరింత ప్రోత్సాహంతో స్టేషన్ల వద్ద బయో టాయిలెట్లను నిర్మించి అక్కడ శుభ్రంగా, పరిశుభ్రమైన వాతావరణానికి ప్రణాళికలు రూపొందించింది. తదనుగుణంగా, కాచిగూడ స్టేషన్‌లో ప్లాట్‌ఫారం 2/3, ప్లాట్‌ఫారం 4/5 వద్ద 2 బయో టాయిలెట్లను నిర్మించింది. ఈ మరుగుదొడ్లు వికలాంగులకు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇటువంటి పర్యావరణ మరుగుదొడ్లు ఇతర ప్రధాన స్టేషన్లలో కూడా నిర్మించి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది.
బయో టాయిలెట్ల పనితీరు ఇలా..
మొదటగా బయో డైజెస్టర్ ఏర్పాటు చేయబడుతుంది. తరువాత బయో డిగ్రేడేషన్ అనంతరం ట్రాక్‌పై వ్యర్థాలు విడుదల అవుతాయి.
బయో టాయిలెట్లలో వాయురహిత బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. ఈ బ్యాకీరియా 6 నుంచి 8 గంటల్లో వీటి సంఖ్య రెండింతలు అవుతుంది.ద్రవ, వాయు పదార్థాలను కుళ్లిపోయేలా చేస్తుంది. పరిసర ఉష్ణోగ్రత వాతావరణంలో రెండు వారాలు ఉంటుంది. సున్నా నుంచి 60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు.
ఈ ప్రక్రియను చల్లటి ఊష్ణోగ్రత ప్రభావితం చేయదు. ఎందుకంటే, వాయురహిత విధానం ప్రకృతిలో ఎక్సోథార్మిక్. చల్లటి ప్రాంతాల్లో రసాయన ప్రక్రియతో చాంబర్ లోపల వేడి లభ్యమవుతుంది.
బయో టాయిలెట్ల ప్రయోజనాలు ఇలా…
ట్యాంకుల నుంచి మరుగుదొడ్లలోకి దుర్వాసన రాదు.
బొద్దింకలు, ఫ్లైస్ ఉండవు.
ట్యాంకుల్లో మల విసర్జన వ్యర్థాలు కనిపించవు.
డైజన్టర్ అడ్డుపడదు.
వాసన, ఘన వ్యర్థాలు లేకుండా ఉంటాయి.
నిర్వహణ అవసరం ఉండదు.
ఆర్గానిక్ పదార్థాలు 90 శాతం తగ్గుదల.
బ్యాక్టీరియా/ఎంజైమ్ వాడాల్సిన అవసరం ఉండదు.
ఘన వ్యర్థాలను తొలగించాల్సిన అవసరం ఉండదు.
బయో టాయిలెట్లు ఏర్పాటు చేసిన కోచ్‌ల వివరాలు ఇలా..
ఎసి కోచ్‌లు 2.స్లీపర్, 3.జనరల్ కోచ్‌లు ట్రాక్‌లపై సుమారుగా 2,74,000 లీటర్ల మలమూత్రా విసర్జాల నిర్మూలన
భారతీయ రైల్వేలో బయో టాయిలెట్ల ఏర్పాటుతో ట్రాక్‌లపై సుమారుగా 2,74,000 లీటర్ల మలమూత్రా విసర్జాలను నిర్మూలించినట్టు అధికారులు తెలిపారు. దీనికి అదనంగా విసర్జాలతో ట్రాకులు తుప్పుపట్టకుండా నిర్మూలించడంతో సంవత్సరానికి సుమారుగా రూ.400 కోట్ల ఖర్చు కూడా తప్పిందని రైల్వే శాఖ ప్రకటించింది. 73,078 కోచ్‌లలో 2,58,906 బయో టాయిలెట్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇకముందు, ప్రస్తుత బయో టాయిలెట్ స్థానంలో వాక్యూమ్ ఫ్లషింగ్ సిస్టం టాయిలెట్ (బయో వాక్యూమ్ టాయిలెట్లు) ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో ఫ్లషింగ్ కోసం నీటి అవసరాలు తగ్గుతాయి, అంతేకాక, వీటి పాన్స్ నుంచి మల వ్యర్థాలను సమర్థవంతంగా ఫ్లష్ చేయవచ్చని రైల్వే శాఖ పేర్కొంది.