Tuesday, November 5, 2024

అందుకే ఈటెల బిజెపి గూటికి: టిఆర్ఎస్ నేతలు

- Advertisement -
- Advertisement -

Etela rajender join in TRS Party

 

హైదరాబాద్: అందరం సిఎం కెసిఆర్ వెంటే ఉంటామని టిఆర్‌ఎస్ పార్టీ కోసం పని చేస్తామని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ లాగా స్వార్థ ప్రయోజనాల కోసం అవసరాలకు పార్టీలు మార్చే సంస్కృతి తమకు లేదని హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక, వైస్ చైర్మన్ నిర్మల స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ప్రజాప్రతినిధులను నేతలను ఈటెల డబ్బుతో కొనే ప్రయత్నాలు మానుకోవాలని వారు సూచించారు. ఈటెల తన అక్రమాస్తుల కాపాడుకోవడానికే బిజెపిలో చేరుతున్నారని మండిపడ్డారు. ఈటెల తన సన్నిహితులను తమ వద్దకు పంపి ప్రలోభాలకు గురి చేయటం సరికాదని, రెండు వందల ఎకరాల భూమి ఉందని ఆనాడు ఈటెల ప్రకటించారని, ఎకరం అమ్మితే వంద కోట్లు వస్తాయని, ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలుస్తామని, అన్నది ఈటెల అహంకారం కాదా? అని రాధిక, నిర్మల ప్రశ్నించారు. తమ వద్దకు ఎవరైనా వచ్చి బేరసారాలు చేయాలని చూస్తే తగిన విధంగా బుద్ది చెబుతామని హుజూరాబాద్ ఎంపిపి రాణి, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కొండల్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News