Friday, November 22, 2024

పెట్రోల్‌ ధరల పెరుగుదలపై రాహుల్‌ ఫైర్

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi slams Modi govt for rise in fuel prices

న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ లో పన్ను వసూళ్ల విపత్తు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయని రాహుల్ తెలిపారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100 దాటిందని.. డీజిల్‌ కూడా రూ.100కు చేరువైందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్‌ ప్రారంభమైందని, పెట్రోల్‌ పంపు వద్ద చెల్లించేటప్పుడు.. మోడీ ప్రభుత్వం పెంచిన ద్రవ్యోల్బణం వికాసాన్ని చూస్తారని రాహుల్ ట్వీట్‌ చేశారు. మరో వైపు కాంగ్రెస్‌ నేత రణదీప్ సూర్జేవాలా పెట్రోల్‌ ధరల పెరుగుదలను అధికమైన ప్రజాదోపిడీగా ఆరోపించారు. దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని చెప్పారు. ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. పెట్రోల్‌, డిజిల్‌ను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని  కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News