న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల దేశ ప్రజలు ఎంతో భాద అనుభవించారని, వందేళ్లలో ఇది అత్యంత ఘోర విషాదమని ప్రధానమంత్రి నేంద్రమోడీ అన్నారు. సోమవారం ప్రధాని మోడీ జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు.”దేశ చరిత్రలోనే ఇంత మెడికల్ ఆక్సిజన్ ఎప్పుడూ అవసరం పడలేదు. అతితక్కువ సమయంలోనే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పది రెట్లకు మించి పెంచాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్ని ఉపమోగించి ఆక్సిజన్ కొరత తీర్చాం. మనం వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసుకోకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేది. వాళ్ల అవసరాలు తీరాకే మనకు ఇచ్చేవాళ్లు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. కరోనా అత్యంత దారుణమైన మహమ్మారి. యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం. ఇంత భారీ జనాభా ఉన్న దేశంలో వ్యాక్సినేషన్ ఎలా చేస్తారని ప్రపంచం భావించింది. స్వదేశీ సంస్థల టీకా ఉత్పత్తితో ప్రపంచానికి మన శక్తి ఏంటో చూపించాం” అని ప్రధాని మోడీ అన్నారు.
PM Modi address to the Nation