- Advertisement -
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేబినెట్ మంత్రి అశోక్ చవాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లి ఆయనను భేటీ అయ్యారు. రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్లు, తుపాను సాయం, కరోనా టీకాల పంపిణీపై మోడీతో చర్చించినట్టు సమాచారం. గత నెలలో ఉద్ధవ్ ఠాక్రే ప్రధానమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రంలో మరాఠా సమాజాన్ని సామాజికంగా, విద్యాపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరాఠా రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
Uddhav Thackeray meets Prime Minister Modi
- Advertisement -