Saturday, November 23, 2024

ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ముల హల్‌చల్

- Advertisement -
- Advertisement -

Two brothers attempt suicide at Pragati Bhavan

కారు కిందపడి ఒకరు, పెట్రోల్ పోసుకుని మరొకరు ఆత్మహత్యాయత్నం
ఇంటిని కబ్జాచేసేందుకు యత్నిస్తున్నారని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ
బ్యాంక్ రుణం కట్టకపోవడంతో ఇల్లు జప్తు చేసిన అధికారులు
అరెస్టు చేసి బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలింపు

మనతెలంగాణ, హైదరాబాద్ : తమ ఇల్లు ఆక్రమణకు గురవుతోందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఇద్దరు సోదరులు ప్రగతిభవన్ వద్ద మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు యత్నించారు. ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని, మరో సోదరుడు మంత్రి హరీష్ రావు కారు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు స్పందించి ఇద్దరిని అడ్డుకున్నారు. ఇద్దరిని అక్కడి నుంచి బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి ఇద్దరు సోదరులను రిమాండ్‌కు తరలించారు. బాధితుల కథనం ప్రకారం…కుత్బుల్లాపూర్, 131డివిజన్ పరిధిలోని సాయిబాబా నగర్ కాలనీ రోడ్డుకు చెందిన సురేష్, నరేష్ ఇద్దరు సోదరులు వీరికి సోదరి ఉంది. తండ్రి నుంచి వచ్చిన భూమిలో 2003లో ఇంటిని నిర్మించుకున్నారు. చెల్లిలి వివాహం చేయడంతో అప్పులు అయ్యాయి. ఇంటిపై రుణం తీసుకుని అప్పులు తీర్చాలని లోన్ కోసం ప్రయత్నిస్తున్నారు.

తన బావ శ్రీకాంత్ స్నేహితుడైన సూర్య పరిచయమయ్యాడు. తాను ప్రభుత్వం ఉద్యోగినని చెప్పి ఇంటిని అతడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి రూ.20లక్షలు రూణం తీసుకున్నాడని తెలిపారు. తర్వాత తమకు తెలియకుండా మళ్లీ రుణం తీసుకున్నాడని తెలిపారు. తాము ఇంటిని ఎవరికి విక్రయించలేదని, రుణం కోసం సూర్య అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. నమ్మినందుకు తమను సూర్య అనే వ్యక్తి మోసం చేశాడని అన్నారు. అతడు ఇంటిని వేరే వారికి విక్రయించాడని తెలిపారు. వారు వచ్చి ఇంటిని ఖాలీ చేయాల్సిందిగా బెదిరిస్తున్నారని తెలిపారు.

ఇంటిని విక్రయించారుః రమేష్, ఇన్స్‌స్పెక్టర్

ములుగు సురేష్ ఇంటిని 2018లో సూర్య అనే వ్యక్తికి విక్రయించాడని పేట్‌బషీరాబాద్ ఇన్స్‌స్పెక్టర్ రమేష్ తెలిపారు. సూర్యకు సురేష్ ఇంటిని రూ.50,00,000లకు సేల్ డిడ్ చేశాడు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి సురేష్ తల్లి పోచమ్మ పేరుపై రూ.25లక్షల రుణం వచ్చిందని తెలిపారు. ఈ డబ్బులను సురేష్ కుటుంబం తీసుకుందని, ఒప్పందం ప్రకారం ఇంటిని సూర్యకు అప్పజెప్పకపోవడంతో సూర్య ఇంటి రుణం కట్టలేదని తెలిపారు. బ్యాంక్ లీగల్ నోటీసు ఇచ్చి కోర్టు ద్వారా ఇంటిని ఖాలీ చేయించారని తెలిపారు. 2019లో సురేష్ మళ్లీ ఇంట్లోకి అక్రమంగా వెళ్లడంతో సూర్య పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి సూర్య, నర్సింగరావును అరెస్టు చేయగా, నరేష్ పరారీలో ఉన్నాడని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News