- Advertisement -
టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కొత్త సినిమాలపై నిర్ణయం తీసుకోవడం లేదట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్‌లో నటించే అవకాశాన్ని కాదనుకుంది. చిన్న పాత్ర అనే కారణంతో తిరస్కరించింది. ఆమె నటించిన ‘లవ్ స్టోరీ’, ‘విరాట పర్వం’ సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అలాగే నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ఇప్పటికే సగం పూర్తయింది. ఈ మూడు సినిమాలు తనకి మరింత పేరు తెస్తాయని ధీమాగా ఉంది సాయి పల్లవి. బలమైన హీరోయిన్ పాత్రలుంటేనే ఆమెను సంప్రదిస్తున్నారు మేకర్స్. హీరోలకి సమానంగా ఆమె కోసం పాత్రలను తీర్చిదిద్దుతున్నారు. బడా కమర్షియల్ సినిమాల కన్నా ఇలాంటి మీడియం రేంజ్ సినిమాలే బెస్ట్ అనుకొంటోంది ఈ భామ. అందుకే పెద్ద హీరోల సరసన చిన్న పాత్రలు చేసేందుకు అంగీకరించడం లేదు.
- Advertisement -