న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 92,596 కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 2,219 మందిని వైరస్ కబలించింది. అదే సమయంలో 1,62,664 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసులు సంఖ్య 2,90,89,069కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,75,04,126 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇండియాలో 3,53,528 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. దేశంలో ప్రస్తుతం 12,31,415 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్ లో ఇప్పటివరకు 23,90,58,360 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 20 జూన్ 8, 2021 వరకు 37,01,93,563 నమూనాలను పరీక్షించారు. అందులో 19,85,967 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.
India reports 92,596 new #COVID19 cases, 1,62,664 discharges, and 2219 deaths in the last 24 hours, as per Union Health Ministry.
Total cases: 2,90,89,069
Total discharges: 2,75,04,126
Death toll: 3,53,528
Active cases: 12,31,415Total vaccination: 23,90,58,360 pic.twitter.com/m13IcoPRqe
— ANI (@ANI) June 9, 2021