- Advertisement -
న్యూఢిల్లీ :కరోనా టీకా లబ్ధిదారులు తమ సర్టిఫికెట్లలో ఏమైనా తప్పులుంటే ఇక నుంచి కోవిన్ డిజిటల్ ప్లాట్ఫాం ద్వారా సరిదిద్దుకోవచ్చు. లబ్ధిదారుల పేరు, పుట్టిన సంవత్సరం, స్త్రీ, పురుషులు ఇలా ఏ తప్పులు దొర్లినా సరిదిద్దుకొనేందుకు వీలు కల్పించే ఫీచర్ను కొవిన్ పోర్టల్లో చేర్చారు. http://cowin.gov.in కు లాగిన్ అయి, తమ సమస్యను లేవనెత్తవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి వికాస్ శీల్ వివరించారు. ఆరోగ్యసేతు యాప్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.
- Advertisement -