Saturday, November 23, 2024

అదే టీమిండియాకు పెద్ద సమస్య

- Advertisement -
- Advertisement -

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాకు ఒక సమస్య ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఫైనల్‌కు ముందు టీమిండియాకు తగినంత ప్రాక్టీస్ లేక పోవడం ఇబ్బంది కలిగించే అంశమేనన్నాడు. న్యూజిలాండ్ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడడం వారికి సానుకూల పరిణామన్నాడు. మరోవైపు భారత్ మాత్రం కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉందని, ఇలాంటి స్థితిలో నేరుగా మెగా టోర్నమెంట్ ఫైనల్లో తలపడడం అనుకున్నంత తేలికేం కాదన్నాడు. అయితే, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియాను తక్కువ అంచన వేయలేమన్నాడు. న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని సాధించే సత్తా భారత్‌కు ఉందన్నాడు. కోహ్లి, రోహిత్, రహానె, పుజారా, అశ్విన్, జడేజా, బుమ్రా, షమీ తదితరులతో భారత్ సమతూకంగా ఉందనే విషయాన్ని మరువ కూడదని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News