లండన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఎలా ఆడాలనే దానిపై ప్రత్యర్థి న్యూజిలాండ్ కోచ్ మైక్ హెసన్ టీమిండియాకు పలు సూచనలు చేశాడు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో ఫైనల్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయమన్నాడు. ఈ సందర్భంగా హెసన్ టీమిండియాకు కొన్ని కీలక సూచనలు చేశాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదన్నాడు. అయితే ఈ ఫైనల్ సమరంలో ఎవరిని ఓపెనర్‌గా దించితే ప్రయోజనంగా ఉంటుందో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కివీస్‌తో పోరులో మయాంగ్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా దించడమే మంచిదన్నాడు. శుభ్‌మన్ గిల్‌తో పోల్చితే మయాంక్ కాస్త మెరుగైన బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. రోహిత్ శర్మతో కలిసి మయాంక్ మెరుగైన ఆరంభాన్ని ఇవ్వడం ఖాయమన్నాడు. గిల్‌తో పోల్చితే తన దృష్టిలో మయాంగ్ మంచి ఓపెనర్ అని పేర్కొన్నాడు. అయితే తన సూచనను పాటించాలా వద్దా అనేది టీమిండియా ఇష్టమన్నాడు. ఇక ఫైనల్ పోరు కోసం తమ జట్టు ఎంతో అతృతతో ఎదురు చూస్తుందని హెసన్ వ్యాఖ్యానించాడు.
మయాంక్‌ను ఓపెనర్‌గా దించాలి: మైక్ హెసన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -