చిరుతను చితక్కొట్టిన బర్రెలు
తీవ్రంగా గాయపడ్డ చిరుత
భయాందోళనలో బూర్గుపల్లి గ్రామస్తులు
మన తెలంగాణ/కోయిలకొండ: మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని బూర్గుపల్లి గ్రామంలో బుధవారం రాత్రి గేదెలపై దాడి చేయడానికి వచ్చిన చిరుతపై గెదెలు ఎదురు దాడి చెసి గాయపర్చిన సంఘటన చొటు చేసుకుంది. అటవీశాఖ అధికారులు, గ్రామస్తుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బూర్గుపల్లి గ్రామంలోని మల్ దేవురి గుట్ట ప్రాంతంలో గల నవాజ్ రెడ్డి పంట పొలంవద్ద గేదెలను పాకలో ఉంచేవాడు. రాత్రి చిరుత గెదెలపై దాడి చేయడం జరిగింది. దీంతో గేదెలు ఓక్కసారిగా గుంపుగా ఎర్పడి చిరుతపై దాడిచేయడం జరిగింది. గేదెల దాడిలో చిరుతకు తీవ్ర గాయాలు అయ్యాయి. చిరుత నడుముకు బాగా గాయాలు కావడంతో అక్కడే కుప్పకూలింది.
గురువారం ఉదయం ఆ ప్రాంత రైతులు, రైతు నవాజ్‌రెడ్డి, గేదెలకు గాయాలు కావడం గమనించి పంట పొలంలో వెతుకగా చిరుత గాయాలతో కదల కుండా పడిఉండటం చూసి జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రయ్య, ఎసై సురేశ్‌గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకొని చిరుతను పరిశీలించారు. చిరుత విషయం తెలుసుకున్న ప్రజలు వందల సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరువడం జరిగింది. మద్యాన్నం జిల్లా అటవీశాఖ అధికారి గంగీరెడ్డి, హైదరాబాద్ నెహ్రు జులాజికల్ పార్టు నుండి వచ్చిన రిస్కూ టీం సహయంతో బొనులోకి ఎక్కించారు. పూర్తిస్థాయిలో చిరుత గాయాల నుండి కోల్కోనేలా చికిత్సను అందిస్తామని డిఫ్‌వొ గంగిరెడ్డి తెలిపారు. హైద్రాబాద్ జంతుప్రదర్షన శాలకు తరలిస్తున్నట్టు ఆయన తెలిపారు.
Chirutha injured in Mahabubnagar