- Advertisement -
జైపూర్: 13 ఏళ్ల బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేయడంతో ఆమె గర్భవతైన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మొకమ్‌ఘఢ్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఓ బాలిక ఆరో తరగతి చదువుతోంది. తాను చెప్పినట్టు వినకపోతే పరీక్షలలో ఫెయిల్ చేస్తానని సురాజ్‌రామ్ అనే ఉపాధ్యాయుడు పలుమార్లు ఆమెను బెదిరించాడు. బాలికను రూమ్‌లో తీసుకుని వెళ్లి మార్చి నెలలో నాలుగు సార్లు పాపపై అత్యాచారం చేశాడు. బాలికకు కడుపులో నొప్పి రావడంతో స్థానిక వైద్యుల దగ్గరికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి చెప్పగానే షాక్ తిన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
- Advertisement -