- Advertisement -
ముంబయి: శ్వాసకోశ సమస్యలతో ఐదురోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన సుప్రసిద్ధ నటుడు దిలీప్ కుమార్ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 98 ఏళ్ల బాలీవుడ్ దిగ్గజం నగర శివార్లలోని ఖర్లో ఉన్న హిందూజా ఆసుపత్రిలో గత ఆదివారం చేరారు. మీ అందరి ఆశీస్సులు, ప్రార్థనలతో దిలీప్ సాబ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతున్నారని, మీ ప్రేమాభినాలే ఆయనకు రక్ష అని దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ట్వీట్ పేర్కొంది. దిలీప్ కుటుంబ మిత్రుడు ఫైసల్ ఫరూఖి ఈ ట్వీట్‌ను షేర్ చేశారు. యాంటిబయోఇక్స్ కొనసాగించాలని వైద్యులు పేర్కొన్నట్లు దిలీప్ సతీమణి సైరాబాను తెలిపారు.
- Advertisement -