హైదరాబాద్: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ను అడ్డుకోవాలంటే కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి అని మంత్రి కోరారు. అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతికి చర్యలు చేపట్టాలని సూచించారు. కోవిడ్ చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు హరీశ్ రావు మద్ధతు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతోందని.. దీంతో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. గత నెల మేలో లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం రూ.4100కోట్లు ఆదాయాన్ని కోల్పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్ఆర్‌బీఎంను 4 నుంచి 5 శాతానికి పెంచాలని కేంద్రాన్ని మంత్రి కోరారు. ఎఫ్ఆర్‌బీఎం పెంపు వల్ల దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
Harish Rao attend to 44th GST Council meeting