- Advertisement -
జైపూర్ : రాజస్థాన్‌లోని బికనూర్ పట్టణంలో సోమవారం నుంచి ఇంటింటికి కొవిడ్ టీకాల కార్యక్రమం చేపడుతారు. ఈ విధంగా దేశంలోనే ఇంటింటికి కొవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టే తొలి పట్టణం బికనూర్ అవుతుంది. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 45 ఏండ్లు పై బడ్డ వారికి టీకాలు వేస్తారు. జిల్లా కేంద్రం అయిన బికనూర్‌లో వ్యాక్సినేషన్ దిశలో అధికార యంత్రాంగం అన్ని చర్యలూ చేపట్టింది. అంబులెన్స్‌లతో సంచార వైద్య బృందాలు సిద్ధం అయ్యాయి. వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబరు ద్వారా పౌరులు టీకాల కోసం పేర్లు, చిరునామాలు, వయస్సు వివరాలను అందించాలని , దీనితో ఇంటింటికి సవ్యంగా వెళ్లి టీకాలు వేసే కార్యక్రమం తేలిక అవుతుందని జిల్లా అధికారులు తెలిపారు.
- Advertisement -