Saturday, November 23, 2024

ఈసారైనా అనుమతి లభించేనా?

- Advertisement -
- Advertisement -

telangana bonalu festival in telugu

హైదరాబాద్: ఆషాఢమాసంలో జరిగే బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందు కు ఈసారి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. గతే డాది కొవిడ్ నడుమ జాతర ఉత్సవాలు హంగు, ఆర్బాటాలు లేకుండా జరిగాయి. అమ్మవారికి బోనాల ను ఆయా దేవాలయాల్లో కాకుండా ఇళ్లల్లోనే నిర్వహిం చాలని ప్రభుత్వం సూచించడంతో నెల రోజుల పాటు బో నాల ఉత్సవాలను భక్తులు నిర్వహించుకున్నారు. భక్తులు లేకుండానే అమ్మవారికి ఆయా దేవాలయాల కమిటీ ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఈసారి వైభవంగా ఉత్సవాలను నిర్వహించడానికి నిర్వాహకులు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. ఇప్పటికే భాగ్యనగర్ మహంకాళీ జాతర బోనాల ఉ త్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షు డి ఎన్నిక కూడా పూర్తయ్యింది. కమిటీ ఆధ్వర్యంలో త్వ రలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు దేవా దాయ శాఖ మంత్రి రెడ్డిని మర్యాద పూర్వ కంగా కలిసి బోనాల జాతర ఉత్సవాలపై చర్చించడానికి నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

గతేడాది నెల రోజుల పాటు

గతేడాది జూన్ 25 నుంచి జూలై 26 వరకు ఆషాఢ మా సంలో నెల రోజుల పాటు అమ్మవారికి బోనాల సమర్ప ణ కార్యక్రమాలు జరిగాయి. పాతబస్తీలో గతేడాది జూలై 19న, సంబంధిత ఆలయాల ప్రతినిధులు, పండితుల మంత్రోచ్చరణాలతో అమ్మవారికి పూజలు, బోనం సమ ర్పణ జరిగింది. మరుసటి రోజు జూలై 20వ తేదీన, ఎలాంటి హడావుడి లేకుండా అమ్మవారి ఘటాల ఊరే గింపు కొనసాగింది.

పరిమిత సంఖ్యలో దేవాలయాలకు చెందిన భక్తులు తప్పా, సాధారణ ప్రజలెవరూ ఈ సా మూహిక ఘటాల ఊరేగింపులో పాల్గొన లేదు. ఈసారి కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య గ ణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఆషాఢ మాసం బో నాల జాతర ఉత్సవాలను ప్రభుత్వం ఆంక్షలను తొలగి స్తుందని ఉత్సవాల నిర్వాహకులు ఆశిస్తున్నారు.

జులై 25న ఉజ్జయినీ మహంకాళీ బోనాలు

గతేడాదిలా కాకుండా ఈసారి అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అవకాశాలుంటాయని భావిస్తున్నారు. మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ ఆయా దేవాలయాలలో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించడానికి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధి స్తుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు జూలై 11న, గోల్కొం డ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో నగరంలో ఉత్సవాలు ప్రాంభమవుతున్నాయి. జులై 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బో నాల సమర్పణ కార్యక్రమాలుంటాయి. అదేరోజు పాత బస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ప్రాంభమవుతాయి.

ఈ ఏడాది జాతర వివరాలు..

ఆగస్టు 1 న పాతబస్తీలో అమ్మవారికి భక్తులు బోనాల సమర్పన పూజా కార్యక్రమాలుంటాయి.
ఆగస్టు 2న పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూ హిక ఊరేగింపు కార్యక్రమాలుంటాయి.
25న సికింద్రబాద్ అమ్మవారి బోనాల జాతర రోజే పాతబస్తీలో కాశీవిశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు.   ఆయా దేవాల యాల్లో ఘటాల స్థపాన జరుగుతుంది.
గతంలో వలే ఈసారి కూడా సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమం నిర్వహించనున్నారు. బో నంతో పాటు పట్టు వస్త్రాల సమర్పణ.
మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉ త్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వ ర్యంలో గోల్కొండ జగదాంబా అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి, సికింద్రా బాద్ ఉజ్జయి మహంకాళీ అమ్మవారు, జూబ్లీహిల్స్ పెద్ద మ్మ తలి, చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారు, లాల్ దర్వాజా సింహవాహిని కలిపి ఏడు దేవా లయాల అమ్మవార్లకు ఏడు బంగారు బోనాలతో పాటు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News