Sunday, November 17, 2024

దిగివస్తున్న కరోనా… రోజువారీ లక్ష లోపే కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 80834 new Covid-19 cases

 

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు లక్షకు దిగువనే నమోదౌతుండడం ఊరట కలిగిస్తోంది. కేసులు 71 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 3303 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. దీంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,70,384కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ అదివారం వెల్లడించింది. ఏప్రిల్ 2 తరువాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కొత్తగా 1,32,062 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

గత కొన్ని రోజులుగా తాజా కేసులు కంటే రికవరీ ఎక్కువగా ఉంటోంది. ఇప్పటివరకు కరోనా నుంచి బయటపడిన వారి సంఖ్య 2,80,43,446 కు చేరింది. ప్రస్తుతం 10,26,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్‌లో ఇప్పటివరకు 23,31,95,048 మందికి డోసులు పంపిణీ అయ్యాయి. దేశంలో రికవరీ రేటు 95.26 శాతానికి పెరిగింది. వారం వారీ పాజిటివ్ రేటు 5 శాతం దిగువకు అంటే 4.74 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివ్ రేటు 4.25 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 37.81 కోట్ల పరీక్షలు జరిగాయని ఆరోగ్యశాఖ వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News