Sunday, November 17, 2024

ఈటలకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలి: కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రలు గంగుల కమాలకర్, కొప్పుల ఈశ్వర్ లు మండిపడ్డారు. సిఎం కెసిఆర్ ఈటలకు సముచిత స్థానం ఇచ్చారని, ఈటలకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. వ్యక్తులు ముఖ్యం కాదు.. వ్యవస్థ ముఖ్యమన్నారు. ఆత్మగౌరవం అంటూ ఈటల, గుజరాత్ లో బీసీలు, దళితులను ఊచకోత కోసిన పార్టీలో చేరతారా? అని ప్రశ్నించారు. హుజురాబాద్ లో కెసిఆర్ బొమ్మపైనే ఈటల గెలిచారని మంత్రి గంగుల అన్నారు. తనకు ఈటల మీద వ్యక్తిగత కోపం ఏమీ లేదని, ఎదుట వాళ్లు సంబరపడితే ఈర్ష పడే వ్యక్తి ఈటల అని మండిపడ్డారు.ఆత్మగౌరవం ఉంటే నల్ల చట్టాలు చేసిన కేంద్రాన్ని ఈటల ప్రశ్నించాలన్నారు. టిఆర్ఎస్ పార్టీని ఈటల విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఆరోపించారు. హుజురాబాద్ అభివృద్ధి కావాలంటే టిఆర్ఎస్ ను మరొసారి గెలిపించాలని మంత్రి గంగుల అన్నారు.

Koppula Eshwar fires on Etela Rajender

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News