- Advertisement -
ఐజ్వాల్ : ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం కలిగిన జియోనా చనా (76) కన్నుమూశారు. 38 మంది భార్యలు, 89 మంది పిల్లల సంతానంతో ప్రపంచంలో అతిపెద్ద కుటుంబానికి పెద్దగా జియోనాకు పేరుంది. మిజోరానికి చెందిన జియోనా చనా ఆదివారం మృతి చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం జోరంతాంగ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జియోనా కుటుంబం వల్లే స్వగ్రామం బక్తాంగ్ త్లాంగ్‌నుమ్ పర్యాటకపరంగా ప్రధాన ఆకర్షణగా నిలిచిందని జోరంతాంగ తెలిపారు. ఈ కుటుంబాన్ని చూసేందుకు దేశవిదేశాల పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేవారని పేర్కొన్నారు.
- Advertisement -