- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో కొత్తగా 4,549 మందికి కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 59మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తాజాగా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 18,07,623కు చేరుకుంది. ఎపిలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 11,941మంది బాధితులు మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 10,114మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
4549 New Corona Cases Reported in AP
- Advertisement -