Saturday, November 16, 2024

పుణే స్పెషల్ మాస్క్

- Advertisement -
- Advertisement -

Pune Special Mask kills corona virus cells

కరోనా వైరస్ కణాలను చంపేస్తుంది

న్యూఢిల్లీ/ పుణే : కరోనా వైరస్‌ను దెబ్బతీసే ఓ ప్రత్యేక రకం మాస్క్ జనం ముందుకు రానుంది. వైరస్‌ను ఆటకట్టించేందుకు అందరికీ మాస్క్ ముఖరక్షాకవచం అయింది. ఈ దశలో యాంటి వైరస్ ఉత్ప్రేరకాలు ధట్టించి ఉండే మాస్క్‌లను ఆవిష్కరించారు. పుణేకు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామిక సంస్థ ఇప్పటి తీవ్రస్థాయి మహమ్మారి దశలోనే ఈ నూతన ఆవిష్కరణకు దిగింది. పుణేకు చెందిన థింక్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఈ సైంటిఫిక్ మాస్క్ రూపకల్పన దిశలో 3 డి ప్రింటింగ్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి ముందుకు సాగిందని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ (డిఎస్‌టి) సోమవారం తమ ప్రకటనలో తెలిపింది. ఈ మాస్క్ ధరిస్తే వీటి పరిధిలోకి వచ్చే వైరస్ మూలకణాలు చనిపోతాయి.

ఈ మేరకు ఈ మాస్క్‌లను యాంటివైరల్ పదార్థాలతో రూపొందించారు. ఇంతవరకూ అందుబాటులో ఉన్న మాస్క్‌లు కేవలం వైరస్ మనిషిలోపలికి రాకుండా చూస్తున్నాయి. అయితే దరిదాపుల్లోకి వచ్చే వైరస్‌ను ఇది దెబ్బతీస్తుందని వెల్లడైంది. వీటిపై ఉండే కోటింగ్‌ను శాస్త్రీయంగా పరీక్షించారు. ఈ కోటింగ్ తన పరిధిలోకి వచ్చే సార్స్ కోవ్ 2ను నిస్తేజం చేస్తుంది. ఈ కోటింగ్‌లో వాడే పదార్థం సోడియం ఒలిఫిన్ సల్ఫోనెట్ సంబంధిత మిశ్రమమని డిఎస్‌టి తెలిపింది. దీనిని వాణిజ్య సరళిలో తయారు చేసి, పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు ఉత్పత్తి సంస్థ అధికారిక అనుమతులకు దిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News