Saturday, November 23, 2024

గర్భిణీ పోలీసులకు ప్రత్యేక వైద్యం

- Advertisement -
- Advertisement -

Special treatment for Pregnant Police

నగర సిపి అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : గర్భిణీ పోలీసులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సిఎఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం 98మంది గర్భిణీ పోలీసులతో నగర సిపి అంజనీకుమార్ సమావేశమయ్యారు. గర్భంతో ఉన్న పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వారి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని, విధులు నిర్వర్తించే సమయాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు. అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డైట్ తదితరాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎడిజి అనిల్‌కుమార్, ఎడిసిపి రామచంద్రారావు, ఎడిసిపి శ్రీనివాసరావు, శ్యాంసుందర్, ఎండి బుర్‌హాన్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News