జిహెచ్ఎంసిలో 182,జిల్లాల్లో 1374 కేసులు
6,06,436కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 1556 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 182 మంది ఉండగా ఆదిలాబాద్ 8 , కొత్తగూడెం 114, జగిత్యాల 26,జనగామ 21,భూపాలపల్లి 24, గద్వాల 19, కరీంనగర్ 88, ఖమ్మం 131, ఆసిఫాబాద్ 9,మహబూబ్‌నగర్ 28, మహబూబాబాద్ 54,మంచిర్యాల 38, మెదక్ 15,మల్కాజ్గిరి 91, ములుగు 29, నాగర్ కర్నూల్ 20, నల్గగొండ 135,నారాయణపేట 16, నిర్మల్ 3, నిజామాబాద్ 18,పెద్దపల్లి 70,రాజన్న సిరిసిల్లా 35, రంగారెడ్డి 90 ,సంగారెడ్డి 21, సిద్ధిపేట్ 33, సూర్యాపేట్ 77, వికారాబాద్ 22, వనపర్తి 25, వరంగల్ రూరల్ 21, వరంగల్ అర్బన్ 52, యాదాద్రి భువనగిరి లో 33 కేసులు తేలాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 6,06,436కు చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 5,82,993కి పెరిగింది. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 3510 మంది మరణించినట్లు వైద్యశాఖ ప్రకటించింది.