- Advertisement -
రెస్టారెంట్లు, థియేటర్లకు 50 శాతం అనుమతి
చండీగఢ్: పంజాబ్‌లో లాక్డౌన్ నిబంధనలను మరింత సడలించారు. రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, జిమ్‌లకు 50 శాతంతో నడిపేందుకు అనుమతిచ్చారు. పెళ్లిళ్లు, అంతిమ యాత్రలకు 50మందికి అనుమతిచ్చారు. బార్లు, క్లబ్బులకు మాత్రం అనుమతించలేదు. బుధవారం నుంచి అమలు కానున్న ఈ సడలింపుల్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ ప్రకటించారు. రాత్రి కర్ఫూను 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేస్తారు. వారాంతాల్లో ఇది శనివారం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సడలింపులిచ్చారు. ఈ ఏడాది మే 8న అత్యధికంగా ఆ రాష్ట్రంలో 9000కు పైగా కేసులు నమోదు కాగా, సోమవారం 629కి పడిపోయాయి.
- Advertisement -