Friday, November 22, 2024

ఆలయంలో చోరీ

- Advertisement -
- Advertisement -

Hundi robbery in peddamma talli temple at jagtial

కొరుట్ల: జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి చొరబడి రెండు హుండీలను ఎత్తుకెళ్లారు. ఒక హుండీని ఖాళీ చేసి ఆలయం వెనకాల వదిలేశారు. మరో హుండీని పట్టణ శివారులో పగలగొట్టి అందులోని డబ్బు, ఆభరణాలతో ఉడాయించారు. ఈ చోరీ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రెండు హుండీల్లో లక్షలోపు డబ్బు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు తెలిపారు.

Hundi robbery in peddamma talli temple at jagtial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News