న్యూఢిల్లీ: ఒక్క వీడియోతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఢిల్లీ ‘బాబా కా దాబా’ యజమాని కాంతా ప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యంతో పాటు నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని చూసి షాక్ కు గురయ్యాని చెప్పారు. ప్రస్తుతం కాంతప్రసాద్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించడం నెట్టింట్లో చర్చనీయంశంగా మారింది. కాంతాప్రసాద్ కు సోషల్ మీడియాలో నెటిజన్లు అండగా నిలిచారు. నెటిజన్ల విరాళాలతో ఆయన రెస్టారెంట్ కూడా స్థాపించారు. వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈ ఏడాది మెదట్లో దానిని మూసివేశారు. ఇటీవలే తమ పాత స్థానానికి వెళ్లి బాబా కా దాబాను మళ్లీ ప్రారంభించారు. ఆయన ఆత్మహత్యయత్నానికి కారణాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి.
Baba Ka Dhaba owner attempted suicide