Monday, November 25, 2024

వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్‌కు 36 రఫేల్ విమానాలు

- Advertisement -
- Advertisement -

వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్‌కు 36 రఫేల్ విమానాలు
ఐఐఎఫ్ చీఫ్ భదౌరియా వెల్లడి

36 Rafale fighter jets into IAF by 2022

హైదరాబాద్: భారత వాయు సేన(ఐఎఎఫ్) అమ్ముల పొదిలోకి 36 రఫేల్ యుద్ధ విమానాలు 2022లో చేరతాయని ఐఎఎఫ్ ప్రధానాధికారి ఆర్‌కెఎస్ భదౌరియా తెలిపారు. ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అందుతాయని విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. రఫేల్ యుద్ధ విమానాల ప్రవేశానికి 2022 లక్షంగా నిర్దేశించామని, కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఒకటి రెండు విమానాల రాకలో స్వల్ప జాప్యం చోటుచేసుకున్నదని, మొత్తమ్మీద 36 రఫేల్ యుద్ధ విమానాలను ఐఎఎఫ్‌లోకి వచ్చే ఏడాది ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తూర్పు లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దుల వద్ద ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుతూ రెండు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ఒక పక్క చర్చలు కొనసాగిస్తూనే కీలక ప్రదేశాల నుంచి నిస్సైనికీకరణను అమలు చేయడం జరుగుతోందని ఆయన చెప్పారు.

36 Rafale fighter jets into IAF by 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News