Saturday, November 16, 2024

ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు బిసిసిఐ అండ

- Advertisement -
- Advertisement -

ముంబై: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులకు ఆర్థికంగా అండగా నిలువాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. టోక్యో క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు తమవంతు ఆర్థిక సహాయం అందిస్తామని బిసిసిఐ కార్యదర్శి జైషా పేర్కొన్నారు. ఈ క్రీడల్లో భారత్‌కు చెందిన దాదాపు 200 అథ్లెట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రీడాకారులకు తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే భారత ఒలింపిక్స్ ప్రతినిధులను కలిసి తగిన సహాయం అందిస్తామని జైషా తెలిపారు. ఒలింపిక్స్ వంటి మెగా క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం అథ్లెట్ల ప్రతిభను ఎంత పొగిడినా తక్కువేనన్నారు. విపరీత పోటీ ఉండే ఒలింపిక్స్ అర్హత సాధించడం చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నారు.

ఎన్నో కష్టాలనొర్చి ఒలింపిక్ బెర్త్ దక్కించుకున్న అథ్లెట్లకు తమవంతు సహకారం అందించేందుకు బిసిసిఐ సదా సిద్ధంగా ఉంటుందని జైషా స్పష్టం చేశారు. ఇక దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనే క్రికెటర్లకు భారీ మొత్తంలో ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీని కోసంఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వేతనాలను ఖరారు చేస్తామని జైషా వివరించారు. కరోనా వళ్ల దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనే ఆయా రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లు ఎంతో నష్టపోయారని, వారందరికీ తగిన ఆర్థిక సహాయం అందజేస్తామని షా పేర్కొన్నారు.

BCCI to support Indian Olympics Athletes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News