Tuesday, November 26, 2024

ఒక్కరోజే రికార్డు స్థాయిలో 69 లక్షల మందికి టీకాలు

- Advertisement -
- Advertisement -

Record 69 lakh people were vaccinated in single day

మొత్తం 28.70 కోట్ల డోసుల పంపిణీ

న్యూఢిల్లీ: సోమవారం ఒక్కరోజే 69 లక్షలమందికిపైగా కొవిడ్-19 టీకాలు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య అది. వ్యాక్సినేషన్ చేపట్టిన తర్వాత ఒక్క రోజులో టీకా డోసుల పంపిణీలో ఇదే అత్యధికం. దాంతో, దేశంలో మొత్తం 28.70 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఈ ఏడాది ఏప్రిల్ 2న కూడా రికార్డు స్థాయిలో 42,65,157మందికి టీకాల పంపిణీ జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు 29,35,04,820 డోసుల టీకాలను కేంద్రం పంపిణీ చేసింది. రాష్ట్రాల వద్ద ఇంకా కొన్ని నిల్వలున్నాయని కేంద్రం తెలిపింది. మూడు రోజుల్లో మరో 24,53,080 డోసుల టీకాలను రాష్ట్రాలకు పంపనున్నట్టు కేంద్రం తెలిపింది.

సోమవారం నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలను పంపిణీ చేయడానికి కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం దేశీయ కంపెనీలు ఉత్పత్తి చేసే టీకాల నుంచి 75 శాతం కేంద్రమే సేకరిస్తోంది. రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నతీరు,వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తున్న రేట్‌తోపాటు జనాభాకు అనుగుణంగా వ్యాక్సిన్లను కేటాయిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. అంతేగాక వ్యాక్సిన్లను వృథా చేస్తున్న రాష్ట్రాలకు ఆమేరకు కేటాయింపులు తగ్గిస్తున్నామని కూడా తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News