యాదాద్రి భువనగిరి: ఏడాదిలో వాసాలమర్రి గ్రామం.. బంగారు వాసాలమర్రి కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గ్రామ ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. ”వాసాలమర్రికి ఇంకో 20సార్లు వస్తా. వాసాలమర్రిలో పోలీసు కేసులు ఉండొద్దు. వెంటనే పరిష్కారం చేసుకోవాలి. ఇవాళ్టి నుంచి వాసాలమర్రి మొత్తం నా కుటుంబమే. వాసాలమర్రిలో మంచి కమ్యూనిటీ హాల్ కడుతాం. ఊరిలో అనారోగ్యంతో ఉన్నవారికి వెంటనే ట్రీట్ మెంట్ చేయిస్తాం. వాసాలమర్రి కూడా ఎర్రవెల్లిలా అభివృద్ధి కావాలి. వాసాలమర్రి గ్రామ నిధి కూడా ఏర్పాటు చేస్తాం. వాసాలమర్రి గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తాం. వాసాలమర్రి గ్రామ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ సత్పతా పమేలా నియమించాం. ఇకనుంచి మీకు తల్లైనా, తండ్రైనా కలెక్టర్ పమేలా సత్పతినే. వాసాలమర్రిలో రేషన్ కార్డులు లేనివాళ్లందరికీ రేషన్ కార్డులు ఇస్తాం. గట్టిగా పట్టుబడితే బంగారు వాసాలమర్రి అవుతుంది. వాసాలమర్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దాం” అని సిఎం కెసిఆర్ చెప్పారు.
CM KCR Speech at Vasalamarri Village