- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో మరో 53మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో గడచిన 24 గంటల్లో 74,453 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 4,169మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అదే సమయంలో 8,376మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 1857352కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 12,416మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,880 యాక్టివ్ కేసులున్నాయని వైద్యశాఖ తెలిపింది.
4169 New Corona Cases Reported in AP
- Advertisement -