హైదరాబాద్: తన భాయ్ ఫ్రెండ్ వల్లే మళ్ళీ తాను మామూలు మనిషిగా మారనని బాలీవుడ్ నటి అవికాగోర్ పేర్కొంది. చిన్నారి పెళ్లికూతురితో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్, ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా సరైనా గుర్తింపు రాలేదు. అదే సమయంలో కొంత బొద్దుగా మారడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
ఈ గ్యాప్ లో నాజూకుగా మారిన ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాను ఇలా మారడానికి కారణం తన ప్రియుడే అని ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవికా వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన మిలింద్ చంద్వానీతో కామన్ ఫ్రెండ్స్ ద్వారా తనకు పరిచయం ఏర్పడిందని, రెండేళ్లుగా అతనితో సహజీవనం చేస్తున్నట్లు తెలిపింది. శారీరకంగానూ, మానసికంగానూ తనలో ఇంత మార్పు రావడానికి అతనే కారణమని, తనను తాను అర్థం చేసుకోవడానికి ఎంతో సాయపడ్డాడని చెప్పింది. తనకు మిలింద్ తోడుగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని అవికా చెప్పుకొచ్చింది.
Avika Gor Open up her boyfriend Milind