- Advertisement -
ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉత్తరకొరియా నివేదన
సియోల్ : ప్రపంచ వేశాలన్నీ కరోనా విలయతాండవంతో అల్లాడుతుంటే ఉత్తర కొరియా ప్రభుత్వం మాత్రం తమ దేశంలో కరోనా కేసు ఒక్కటి కూడా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు స్పష్టం చేసింది. జూన్ 10 నాటికి తమ దేశంలో 30 వేల మంది నమూనాలను పరీక్షించగా, ఒక్కరికి కూడా కరోనా సోకినట్టు బయటపడ లేదని వివరించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ మంగళవారం తన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. జూన్ 4 నుంచి 10 వరకు 733 మందికి పరీక్షలు నిర్వహించగా, 149 మందిలో ఇన్‌ఫ్లూయెంజా, తీవ్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలు మాత్రమే బయడపడినట్టు పేర్కొంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా మూలాలున్న చైనాకు సరిహద్దులో ఉన్న ఉత్తర కొరియాలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే అయినా ఒక్క కేసు కూడా బయటపడలేదనడంపై విస్మయం చెందుతున్నారు.
- Advertisement -