- Advertisement -
హైదరాబాద్: ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల విధివధానాలపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్ లోనూ వచ్చినట్లు పరిగణిస్తామని ప్రభుత్వం తెలిపింది.ప్రాక్టికల్స్ కు వంద శాతం మార్కులు కేటాయిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఇక, ఫస్ట్ ఇయర్ లో బ్యాక్ లాక్స్ ఉంటే 35 శాతం మార్కులతో పాస్ చేస్తామని, సెకండ్ ఇయర్ లోనూ అదే సబ్జెక్టులకు 35శాతం మార్కులు కేటాయిస్తామని తెలిపింది. పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థులకు 35శాతం మార్కులతో పాస్ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితుల మెరుగయ్యాక పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
TS Govt issues Guidelines for Inter 2nd Year results 2021
- Advertisement -