సిమ్లా: భుంటార్ విమానాశ్రయం సమీపంలో కులు జిల్లా పోలీసు సిబ్బంది, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ భద్రతా సిబ్బందికి మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త పెద్దదై చివరకు కొట్టుకుని తన్నుకునే వరకూ వెళ్లింది. ముందు కోపాన్ని ఆపుకోలేక సిఎం సిబ్బంది ఒకరిపై ఎస్పి చేయి చేసుకున్నాడు. దీంతో ఒకరిని ఒకరు తోసుకుంటూ గొడవకు దిగడంతో పక్కనున్న మిగతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన సిమ్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయం, ఎస్పి గౌరవ్ సింగ్ ను ట్రాన్స్ ఫర్ చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర సిఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల కులు పర్యటన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది.
Altercation between Kullu SP and Himachal CM's security personnel during Gadkari's visit to Kullu.
DGP Sanjay Kundu said Kullu SP Gaurav Singh had been transferred to Range Office Mandi.#HimachalPradesh #himachal #bjp #HPgovt #shimla #kullu pic.twitter.com/Qc8F5PEnaz
— Sidharth Shukla (@sidhshuk) June 24, 2021
Kullu SP Slapping CM’s Security personnel