హైదరాబాద్: సిఎం కెసిఆర్ ముందుచూపుతోనే కరోనా ఉధృతిని కట్టడి చేయగలిగారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలందించాలనే ఉద్దేశంతోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టామన్నారు. పది వేల కోట్లు ఖర్చయినా వైద్య రంగాన్ని మెరుగుపర్చాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని ప్రశంసించారు. కరోనా కట్టడిలో తెలంగాణకు కేంద్రం సహకరించడంలేదని, ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నామని తలసాని స్పష్టం చేశారు. కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రులపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేలాది మంది కరోనా నుంచి కోలుకున్నారని, చుట్టుపక్కల నాలుగు రాష్ట్రాల నుంచి కరోనా బాధితులకు ఇక్కడ ట్రీట్‌మెంట్ తీసుకున్నారని, గత ప్రభుత్వాలు ఆస్పత్రుల్లో చీపురుకట్టలకు కూడా డబ్బులు ఇచ్చేవారు కాదని, సిఎం కెసిఆర్ వైద్య ఆరోగ్య రంగానికి వేలాది కోట్లు కేటాయిస్తున్నామన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు.
కెసిఆర్ ముందుచూపుతోనే కరోనా కట్టడి: తలసాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -