Saturday, November 23, 2024

జార్ఖండ్‌లో మదపుటేనుగు దాడిలో 16 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Expelled By Herd, Jharkhand Elephant Kills 16

 

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఓ మదపుటేనుగు రెండు నెలల్లో 16మందిని చంపేసిందని అటవీశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. సంతాల్ పరగణ ప్రాంతంలోని జంతువుల సంరక్షణశాల నుంచి బయటకు వెళ్లిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ దాడులకు పాల్పడిందని తెలిపారు. 15 ఏళ్ల వయసున్న ఈ మగ ఏనుగు లైంగిక వాంఛల్ని తీర్చుకునేందుకు దురుసుగా ప్రవర్తించడంతో సంరక్షణశాల నుంచి బయటకు పంపినట్టు ఆ అధికారి తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున వృద్ధ దంపతులను తొండంతో ఎత్తి పడేయడంతో వారు మరణించినట్టు ఆ అధికారి తెలిపారు. అయితే, ఈ ఏనుగు తనకు తానుగా మనుషులపై దాడికి పాల్పడలేదని, దాంతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించడం, లేదా రెచ్చగొట్టేలా ప్రవర్తించినవారిపైనే ఎక్కువగా దాడులకు పాల్పడిందని ఆ అధికారి తెలిపారు. ఇళ్లను ధ్వంసం చేసిన ఘటనలేమీ జరగలేదన్నారు. ఈ ఏనుగును పట్టుకొని తిరిగి సంరక్షణశాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ అధికారి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News